సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ స్వల్ప అస్వస్థత పాలయ్యారు. నాలుగు రోజుల క్రితం ఆయన ఇంట్లో జారిపడినట్టు తెలుస్తోంది. శనివారం రాత్రి పెయిన్స్ ఎక్కువగా వుండడంతో సికింద్రాబాద్ లోని ప్రముఖ హాస్పిటల్ లో కుటుంబ సభ్యులు జాయిన్ చేశారు. ప్రస్తుతం కైకాల ఆరోగ్యం గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. కైకాల ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఇంట్లోనే ఉంటున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడు, మహర్షి చిత్రాల్లో ఆయన చివరి సారిగా కన్పించారు. Read Also…