మహిళల ప్రపంచకప్ 2025 రెండవ సెమీస్‌లో భారత్, ఆస్ట్రేలియాలు తలపడనున్నాయి. గురువారం (అక్టోబర్ 29) నవీ ముంబైలో మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ సెమీస్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్‌కు వరుణ దేవుడు అంతరాయం కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకున్నాయి. ఉదయం వర్షం పడే అవకాశం ఉంది. రోజంతా మేఘావృతమై ఉంటుందని ముంబై వాతావరణ శాఖ తెలిపింది.…