ఒకప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ, మాజీ ఓపెనర్ విరేందర్ సెహ్వాగ్‌ల మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉండేవని తెగ ప్రచారాలు జరిగాయి. ముఖ్యంగా.. 2008లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తుది జట్టు నుంచి సెహ్వాగ్‌ను ధోనీ తొలగించినప్పుడు, ఆ ప్రచారాలు మరింత బలపడ్డాయి. కానీ.. అవన్నీ అవాస్తవాలేనని ఆ తర్వాత నిరూపితమైంది. అయితే, అప్పట్లో జరిగిన ఓ పరిణామం గురించి మాత్రం తాజాగా సెహ్వాగ్ పంచుకున్నాడు. ధోనీ తనని అలా జట్టు నుంచి తొలగించినప్పుడు తాను…