ఆంధ్రా భద్రాచలంగా పేరుగాంచిన ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు కడప నగర శివార్లలోని చిరు వ్యాపారుల పాలిట శాపంగా మారాయి. వీఐపీల రాక సందర్భంగా ప్రభుత్వ స్టల్లాల్లోని దుకాణాల తొలగింపుపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఎన్నో ఏళ్లుగా చిరువ్యాపారాలు చేస్తున్న దుకాణాలను అధికారులు తొలగించే యత్నాలను అక్కడి వ్యాపారులు నిరాశిస్తున్నారు. ఉన్నపళంగా దుకాణాలు తెసేయమంటే మా పరిస్థితి ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. కమలాపురం రోడ్డు లోని విమానాశ్రయం నుంచి కడప నగరంలోకి వచ్చే మార్గంలో అలాంఖాన్ పల్లె ఇర్కాన్ సర్కిల్…