Delhi Accident: ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు డివైడర్ పై నిద్రిస్తున్న వారిపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు డివైడర్ పై నిద్రిస్తున్న వారిపైకి వెళ్లింది. దీంతో నిద్రిస్తున్న నలుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ట్రక్కును గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు అక్కడిక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడిన నలుగురిని ఆస్పత్రికి…