అమరావతిని రాజధానిగా అంగీకరించాలని ఒకవైపు అమరావతి రైతులు ఉద్యమం కొనసాగిస్తున్న వేళ మంత్రులు తమదైన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ భూముల ధరలు పెంచుకోవటం కోసమే ప్రయత్నిస్తూ రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ఆరోపించారు. నగరి లో మండల సమావేశం అనంతరం మీడియా తో మాట్లాడారు ఎమ్మెల్యే రోజా. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు పన్నులు కడుతుంటే సమావేశంలో పాల్గొన్న నాయకులు కేవలం అమరావతి పరిధిలోని 29…