అసలే పాక్ క్రికెట్ బోర్డు నష్టాల్లో మునిగిపోయింది. ఇటీవలే న్యూజిలాండ్ జట్టు పర్యటనకు వచ్చి చివరి నిమిషంలో పర్యటను క్యాన్సిల్ చేసుకొని వెనక్కి వెళ్ళిపోయింది. దీంతో పాక్ క్రికెట్ కు మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. న్యూజిలాండ్ తో మ్యాచ్ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. బందోబస్తు కోసం 500 మంది పోలీసులను ఏర్పాటు చేసింది. అంతేకాదు, బోర్డర్ లో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిని కూడా రంగంలోకి దించింది. వీరందరిని న్యూజిలాండ్ జట్టు బస చేస్తున్న హోటల్స్ వద్ద బందోబస్తుకు ఏర్పాటు…