కోల్‌కతాలోని లా కాలేజీలో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. అరెస్టయిన నలుగురిలో ముగ్గురు ముందుగానే ప్లాన్ వేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ కేసులో నాల్గవ నిందితుడు కళాశాల సెక్యూరిటీ గార్డు. "ఈ అత్యాచారం ఘటనను ఈ ముగ్గురు ముందుగానే ప్లాన్ వేశారు.
సౌత్ కోల్‌కతా లా కాలేజీ అత్యాచారం కేసులో కోల్‌కతా పోలీసులు శనివారం ఓ సెక్యూరిటీ గార్డును అరెస్టు చేశారు. ఈ కేసులో ఇది నాల్గవ అరెస్టు. గతంలో ప్రధాన నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సహా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం..