Hyderabad to Goa: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లే వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి గోవాకు నేరుగా రైలు నడపడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో సికింద్రాబాద్ - వాస్కోడిగామా (గోవా) మధ్య కొత్త ఎక్స్ ప్రెస్ రైలు (17039/17040) ప్రతిపాదనకు రైల్వే శాఖ ఆమోద ముద్ర వేసింది.