Business Headlines 23-02-23: హైదరాబాద్ టు బ్యాంకాక్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్‌కి నేరుగా విమానాలను ఇప్పటికే థాయ్ ఎయిర్‌వేస్ సంస్థ నడుపుతుండగా ఇప్పుడు మరో కంపెనీ ఈ సర్వీసును ప్రారంభించింది. నోక్ ఎయిర్ అనే సంస్థ హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌లోని డాన్ ముయాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి నిన్న బుధవారం కొంత మంది ప్రయాణికులను చేరవేసింది.