ఇవాళ ఉదయం విజయవాడ పున్నమి ఘాట్ వద్ద సీ ప్లేన్ ట్రయల్ రన్ ను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు.. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి, పర్యాటక శాఖామంత్రి, ఇతర స్ధానిక ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొంటారు.. పున్నమి ఘాట్ నుంచి సీఎం చంద్రబాబు సీ ప్లేన్ లో ప్రయాణిస్తారు.. సీ ప్లేన్ లో విజయవాడ నుంచి శ్రీశైలం చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు..