తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ ఏడాది సంక్రాంతి సీజన్ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒకేసారి ఐదు పెద్ద సినిమాలు బరిలో ఉండటంతో పాటు సూపర్ హిట్ గా కూడా నిలిచాయి. దీంతో థియేటర్ల దగ్గర సందడి ఎంత ఉందో, స్క్రీన్ల కేటాయింపు విషయంలో ఎగ్జిబిటర్లకు అంతటి పరీక్ష ఎదురవుతోంది. ముందుగా వచ్చిన ప్రభాస్ “ది రాజా సాబ్”, చిరంజీవి “మన శంకరవర ప్రసాద్ గారు”, రవితేజ “భర్త మహాశయులకు విజ్ఞప్తి”, నవీన్ పొలిశెట్టి…