వేసవి సెలవుల మజా ముగింపు దశకు చేరుకుంది. నెలన్నర విరామం తర్వాత బడిగంటలు ఇవాళ్టి నుంచి మోగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 41 వేల స్కూళ్లు, గురుకులాలు, వసతిగృహాలు తిరిగి తెరుచుకోనున్నాయి. దీంతో దాదాపు 60 లక్షల మంది స్టూడెంట్స్ తిరిగి బడిబాటపట్టనున్నారు.