Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాన్ ప్రభావంతో ప్రభుత్వం హై అలర్ట్ అయింది. అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రత్యేకంగా జోనల్ ఇంఛార్జుల నియామకం చేపట్టింది. ఈ సందర్భంగా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించారు.