School Bus Fire Accident: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలంలోని కృష్ణారెడ్డి పేటలో ఈ రోజు ఉదయం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో విద్యార్థులను ఎక్కించుకుంటుండగానే మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు భయాందోళనకు గురయ్యారు. అయితే డ్రైవర్, క్లీనర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. స్కూల్ బస్సులో మంటలు రావడం గమనించిన డ్రైవర్, క్లీనర్ తక్షణమే స్పందించి విద్యార్థులను త్వరగా సురక్షితంగా బస్సు నుండి కిందకు దింపేశారు.…