Bus Driver Saves 50 Students:ఏకంగా 50 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడి.. తనువు చాలించాడు ఓ స్కూల్ బస్సు డ్రైవర్.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట సెంటర్‌లో ఈ రోజు ఉదయం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రాజమండ్రి గైట్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు డ్రైవర్ దెందుకూరి నారాయణరాజు (60) తన కర్తవ్య నిర్వహణలో విద్యార్థుల ప్రాణాలను కాపాడి తాను మాత్రం ప్రాణాలు…
Road Accidents: పల్నాడు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. హైదరాబాదు నుంచి బాపట్ల వెళ్లతున్న మార్నింగ్ ట్రావెల్స్ బస్సు పల్నాడు జిల్లాలో అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న గుంటలోకి దూసుకెళ్లింది. అయితే ప్రమాదంలో ప్రయాణీకులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాజుపాలెం మండలం రెడ్డిగూడెం సమీపంలో బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న గుటలోకి వెళ్ళింది. రోడ్డు నిర్మాణం పనులకోసం ఏర్పాటు చేసిన సిమెంట్ పైప్ కు తగిలి బస్సు నిలిచిపోయింది. దీంతో ప్రయాణీకులు…
Accident : పెద్దఅంబర్ పేట్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి రిత్విక అనే నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. హయత్‌నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్ లో రిత్విక LKG చదువుతోంది. అయితే.. రోజులాగే ఈ రోజు కూడా బాలిక బస్సు దిగింది. అయితే.. బాలిక దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ చేయడం ప్రమాదం చోటు చేసుకుంది. కుమార్తె మరణ వార్తతో బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి…
దాదాపు 20 మంది స్కూల్ విద్యార్థులు తృటిలో పెను ప్రమాదం తప్పింది.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లాలో ఇవాళ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది.. సఖినేటిపల్లి నుంచి నరసాపురం వెళ్తున్న ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సు.. మలికిపురం మండలం దిండి గ్రామంలో ప్రమాదం జరిగింది.. వేగంగా దూసుకొచ్చిన ట్రాక్టర్, స్కూల్ బస్సును ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో స్కూల్ బస్సు నుజ్జునుజ్జు అయ్యింది… ప్రమాద సమయంలో బస్సులో సుమారు 20 విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తుండగా.. నలుగురు విద్యార్థులకు…