కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటనకు రానున్నారు. ఈమేరకు ఆయన షెడ్యూల్ ను బీజేపీ విడుదల చేసింది. ఈనెల 15వ తేదీన భద్రాచలంలో రాములవారి దర్శనంతో అమిత్ షా పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. దీని కోసం ముందుగా ఈనెల 15న ఉదయం 11గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి షా చేరుకుంటారు.