రంగారెడ్డి జిల్లా కొందుర్గులోని స్కాన్ ఎనర్జీ ఐరన్ పరిశ్రమలో భారీ పేలుడు ప్రమాదం జరిగింది. పేలుడు దాటికి చిన్న భవనం కుప్పకూలిపోయింది. అంతేకాకుండా.. ఫ్యాక్టరీలోని రేకులు మొత్తం చెల్లాచెదురు అయ్యాయి. అయితే కొంతమంది కార్మికులు పనిచేస్తుండగా వారిపై వేడి ద్రవం పడినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు కార్మికులకు తీవ్రగాయాలు కాగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం షాద్ నగర్ ఆస్పత్రికి తరలించారు.