తెలుగు చలనచిత్రసీమలో మరపురాని చిత్రాలను అందించిన అరుదైన సంస్థల్లో ‘అన్నపూర్ణ పిక్చర్స్’ స్థానం ప్రత్యేకమైనది. తమ తొలి చిత్రం ‘దొంగరాముడు’తోనే ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించిన ‘అన్నపూర్ణ’ సంస్థ నిర్మించిన రెండవ సినిమా ‘తోడికోడళ్ళు’. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిన ఈ చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు. అక్కినేనితో ఆదుర్తి తెరకెక్కించిన తొలి చిత్రమిదే. ఈ సినిమా ఘనవిజయం తరువాత ఏయన్నార్, ఆదుర్తి కాంబినేషన్ లో అనేక జనరంజక చిత్రాలు రూపొందాయి. 1957 జనవరి…
భార్యభర్తలంటే కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా వుండాలంటారు. జీవితాంతం కలిసి వుంటామని బాసలు చేసుకుంటారు. ఒకరికి కష్టం వస్తే మరొకరు అల్లాడిపోతారు. ఒకరు కన్నుమూస్తే.. మరొకరి గుండె కూడా విశ్రాంతి తీసుకుని వారి దగ్గరే వెళ్ళిపోతుంటుంది. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. సినిమాల్లో మనం ఇలాంటివి చూసి కన్నీళ్ళు పెట్టుకుంటాం. కానీ గుండెపోటుతో భార్య మృతి చెందిన కాసేపటికే భర్త కన్నుమూసిన ఘటన కన్నీళ్ళు తెప్పించింది. తిరిగి రాని లోకాలకు చేరిన భార్య మృతదేహాన్ని…
(డిసెంబర్ 6న సావిత్రి జయంతి)నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావులోని అసలైన నటుణ్ణి వెలికి తీసిన చిత్రం దేవదాసు (1953). ఈ చిత్రంలో దేవదాసు పాత్రతో పోటీ పడి పార్వతి పాత్రలో జీవించారు సావిత్రి. అంతకు ముందు 1950లో ఏయన్నార్ ను టీజ్ చేస్తూ సంసారం చిత్రంలో ఓ పాటలో తళుక్కుమన్నారు సావిత్రి. ఆ తరువాత అదే ఏయన్నార్ కు సావిత్రి విజయనాయికగా మారడం విశేషం! సావిత్రితో ఏయన్నార్ నటించిన తొలి చిత్రం దేవదాసు. అయితే దాని కంటే ముందుగా…