పశ్చిమ బెంగాల్‌లోని రైల్వే స్టేషన్‌లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) సిబ్బంది ఒక ప్రయాణికుడిని రక్షించింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఆర్పీఎఫ్ ఇండియా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై నిలబడిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా ట్రాక్‌పైకి వచ్చి పడుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు గమనించిన కానిస్టేబుల్ కె. సుమతి ఆ వ్యక్తిని రక్షించడానికి పరుగెత్తుకుంటూ వచ్చింది. దాంతో ఆ వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు.