హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. ఇక ఈ సినిమాలో నవీన్ చంద్ర ‘అమరేందర్’ అనే ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని ‘అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లిలు’ నిర్మిస్తున్నారు. శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లేను అందించారు. ఈ చిత్రాన్ని ‘క్రైమ్ థ్రిల్లర్’ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. “సత్యభామ” సినిమాను జూన్ 7న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది. Satyabhama…