రాజన్న సిరిసిల్ల పట్టణం శాంతి నగర్ బైపాస్ రోడ్డులో సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహనికి పూల మాల వేసి నివాళులు అర్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాజ్యాధికారం కొరకు పాటుపడిన మహానుభావుడు పాపన్న గౌడ్ అని ఆయన కొనియాడారు. భారత దేశానికి స్వాతంత్రం, తెలంగాణలో ఉన్న నిరంకుశ పాలనకు చరమగీతం పాడింది పాపన్ననే అని ఆయన వ్యాఖ్యానించారు. సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించాలన్న సంకల్పంతో…