గత కొంత కాలంగా వివిధ భాషల్లో వస్తున్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీస్ ను చూస్తుంటే మన వాళ్ళంతా మూస పంథాలో సాగిపోతున్నారనే భావన కలుగుతోంది. తీస్తే బయోపిక్స్ తీస్తున్నారు లేదా ఎవరైనా క్రీడాకారుడు తనకు జరిగిన అవమానాన్ని తన తర్వాత తరానికి శిక్షణ ఇచ్చి తద్వారా తన పగప్రతీకారాలను తీర్చుకున్న సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు కాకపోతే తనకు క్రీడా మైదానంలో జరిగిన అన్యాయానికి తానే ఓ ఐదు, పదేళ్ళ తర్వాత తిరిగి గెలుపుతో బదులిచ్చిన…