పామును చూడగానే మనుషులు వణికిపోతారు. పాములను చంపడానికి ఈ భయమే ప్రధాన కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. ఏటా 50 లక్షల మంది పాముకాటుకి గురవుతున్నారు. అందులో దాదాపు 81 వేల నుంచి లక్షా 38 వేల మంది వరకూ ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలో పాముకాటుకి గురై చనిపోతున్న వారి సంఖ్య భారత్‌లోనే అత్యధికంగా ఉంది. 2020లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం..