తెలంగాణ టీఆర్‌ఎస్ లో విభేదాలు ముదురుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఎమ్మెల్యే బాల్క సుమన్ ఒంటెత్తు పోకడలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న భీమారం మండలానికి చెందిన కీలక నేత చెరుకు సరోత్తంరెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కొద్ది రోజుల్లో జిల్లా స్థాయిలో 20 వేల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి రాజీనామాలు ప్రకటిస్తామని చెరుకు సరోత్తంరెడ్డి ప్రకటించారు. నిన్న శుక్రవారం ఆయన భీమారంలో ప్రెస్మీట్ ఏర్పాటు చేసి ఎమ్మెల్యే…