చిత్రవిచిత్రాలకు నెలవు చిత్రసీమ. ఇక్కడ ఒకటి కావాలని వచ్చి, మరోటి అవుతూ ఉంటారు. ఒకలా ఓ సారి వెలుగులు విరజిమ్మి, మరోలా ఇంకోసారి తళుక్కుమనే వారికీ ఇక్కడ కొదువే లేదు. అలా వెలుగొందుతున్నవారిలో ఓ నాటి నటి, ఈ నాటి మేటి డబ్బింగ్ ఆర్టిస్ట్ సరిత గురించి తప్పకుండా చెప్పుకోవాలి. సరిత పలుకుతో ఈ నాటికీ మురిపిస్తున్న చిత్రాలెన్నో వస్తున్నాయి. తాజాగా వచ్చిన ‘సర్కారువారి పాట’లోనూ నదియాకు సరిత గళవిన్యాసాలు అలరించాయి. సరిత పదహారణాల తెలుగమ్మాయి. ఆమె…