Punjab High Alert: పంజాబ్ పోలీసులు రాడికల్ ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ కోసం వేట కొనసాగిస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు మార్చి 18న పంజాబ్ పోలీసులు, సెంట్రల్ టీమ్స్ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి. అప్పటి నుంచి అతడు తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇదిలా ఉంటే పంజాబ్ పోలీసులపై అమృత్ పాల్ సింగ్ ఎఫెక్ట్ పడింది. ఏప్రిల్ 14 వరకు పోలీసులందరికీ సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది