(జూన్ 26న ‘సప్తపది’కి 40 ఏళ్ళు)తన చిత్రాలలో సమతాభావాన్ని, సమానత్వాన్ని చాటుతూ చిత్రాలను రూపొందించారు కళాతపస్వి కె.విశ్వనాథ్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన అనేక చిత్రాలలో సమాజంలోని ఛాందసభావాలపై నిరసన గళం వినిపించారు. జనం మారాలని కోరుకున్నారు. ‘కళ కళ కోసం కాదు ప్రజాశ్రేయస్సు కోసం’ అన్న మాటను తు.చ