టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో తాను ఆడాల్సిందని, చివరి నిమిషంలో తుది జట్టు నుంచి తనను తప్పించారని టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ తెలిపాడు. తుది జట్టు నుంచి తప్పించినందుకు కెప్టెన్ రోహిత్ శర్మ తనకు క్షమాపణలు చెప్పాడన్నాడు. తుది జట్టులో లేకపోవడంతో తాను కాస్త నిరాశకు గురయ్యానని, కానీ ఇలాంటి పరిస్థితులు గతంలో ఎన్నో ఎదుర్కొన్నానని సంజూ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన సంజూ.. ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు. రిషబ్ పంత్ జట్టులో…