ఐపీఎల్ ప్రాంచైజ్ లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) ఓనర్ సంజీవ్ గోయెంకా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎల్‌ఎస్‌జీ మ్యాచ్‌లో గెలిస్తే ఫర్వాలేదు కానీ.. ఓడితే మాత్రం వెంటనే మైదానంలోకి వచ్చేస్తారు. కెప్టెన్‌ను అందరి ముందూ మందలిస్తారు. కోచ్‌లు ఉన్నా సరే డ్రెస్సింగ్ రూమ్‌లోనూ ఆటగాళ్లపై మండిపడుతుంటారు. ఈ చర్యల కారణంగానే ఎల్‌ఎస్‌జీని కేఎల్ రాహుల్ వదిలివెళ్లాడు. ఐపీఎల్ 2025లో కెప్టెన్‌గా రిషభ్ పంత్ ఎంట్రీ ఇచ్చాడు. ఓ కెప్టెన్ జట్టును వీడినా.. సంజీవ్ గోయెంకా…