తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఓ సభలో కవితను విమర్శిస్తూ, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై బీఆర్‌ఎస్ మండిపడ్డారు. కవితను అరెస్ట్ చేయకుంటే ముద్దులు పెడతారా అంటూ బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.