Home
Sanjay Raut
Sanjay Raut News
-
BJP: తిరుగుబాటు కోసమే వియత్నాంకు రాహుల్ గాంధీ.. బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ.!
BJP: రాహుల్ గాంధీ విదేశాల్లో తిరుగుబాటుకు కుట్ర పన్నుతున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర సంచలన ఆరోపణలు చేశారు. నవంబర్ 1న ప్రతిపక్షాలు భారీ నిరసనకు సిద్ధమవుతున్నాయని, దీని కోసం కుట్ర పన్నుతున్నారని బీజేపీ ఆరోపించింది. పదే పదే నిరసనలు చేసి ప్రభుత్వాన్ని మార్చేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని మార్చడమే ప్రతిపక్షాలు ఇప్పటికే స్పష్టం చేశాయని, దానిని సాధించడానికి హింస అవసరమని చాలా మంది నాయకులు చెబుతున్నారని ఆరోపించారు. శివసేన యూబీటీ ఎంపీ… -
Sanjay Raut: ‘‘అల్బేనియా సుప్రీంకోర్టుకు నిప్పు’’.. సంజయ్ రౌత్ పోస్ట్‌పై రాజకీయ దుమారం..
Sanjay Raut: అల్బేనియా దేశంలో సుప్రీంకోర్టును ఆందోళనకారులు తగలబెట్టిన ఘటనపై శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ రాజకీయ వివాదానికి కారణమైంది. ‘‘అల్బేనియా ప్రజలు సుప్రీంకోర్టును తగలబెట్టారు. సుప్రీంకోర్టు అవినీతిపరులైన ప్రధాన మంత్రులకు సహాయం చేస్తోందనే కోపంతో వారు ఈ పని చేశారు. నిరసన చేస్తున్న ప్రజలు పార్లమెంట్, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు మంత్రుల ఇళ్లపై కూడా దాడి చేశారు. ఈ ఘటనల నుంచి అన్ని దేశాలు గుణపాఠాలు నేర్చుకోవాలి’’ అని ఆయన… -
Supreme Court: CJI సూర్యకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
Supreme Court: భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంజయ్ రౌత్‌తో పాటు జర్నలిస్ట్ నిఖిల్ వాగ్లేకు సుప్రీంకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) సంజయ్ రౌత్, నిఖిల్ వాగ్లేపై క్రిమినల్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్బాల్య బాగ్చితో కూడిన ధర్మాసనం ఈ… -
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
Devendra Fadnavis: శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేసి, ఢిల్లీకి వెళ్తారని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలకు కారణమైంది. రాబోయే ఒకటి రెండు నెలల్లో కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ జరిగితే మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన మార్పులు చోటుచేసుకోవచ్చని శుక్రవారం సంజయ్ రౌత్ అన్నారు. సీఎం ఫడ్నవీస్‌కు కేంద్రంలో కీలక బాధ్యతలు అప్పగించవచ్చని, ఒక సీనియన్ బీజేపీ… -
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
Delimitation Bill: లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపచేసుకోవడానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటోంది. వర్షాకాల సమావేశాల్లో సభ ముందుకు ఈ బిల్లును మరోసారి తీసుకురాబోతోంది. మెజారిటీ మార్క్ సాధించేందుకు ప్రతిపక్ష ఎంపీల మద్దతు కూడగడుతోంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు బిల్లుకు మద్దతు ఇవ్వమని భీష్మించుకుని ఉన్న ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన(యూబీటీ) ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. ఆ పార్టీ ఎంపీ సంజయ్ రైత్ మాట్లాడుతూ.. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వొచ్చని చెప్పారు. గురువారం… -
Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన అధినేత, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ భేటీ సంచలనంగా మారింది. ఈ భేటీపై ఎంపీ, పవార్ కుమార్తె సుప్రియా సూలే స్పందించారు. ఈ భేటీపై జరుగుతున్న చర్చల్ని ‘‘టీకప్పులో తుఫాను’’గా అభివర్ణించారు. ఈ భేటీకి ఇంత ప్రచారం అవసరం లేదని చెప్పారు. ఇది మర్యాదపూర్వకంగా జరిగిన చిన్న సమావేశమని, దీనికి రాజకీయ రంగు పులమాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కొందరు శరద్… -
Uddhav Shiv Sena: ఉద్ధవ్‌పై కోపం లేదు, నిధుల కోసమే తిరుగుబాటు: రెబల్ ఎంపీ..
Uddhav Shiv Sena: ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు కూడా షిండే శివసేనలో చేరడంపై స్పష్టత వచ్చింది. తిరుగుబాటు చేసిన ఉద్ధవ్ వర్గం ఎంపీలు త్వరలో ఏక్నాథ్ షిండే శివసేనలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని రెబల్ ఎంపీ నాగేష్ పాటిల్ అష్టికర్ వెల్లడించారు. తన లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష పార్టీలో ఉండటం వల్ల నియోజకవర్గంలో డెవలప్మెంట్ పనులకు నిధుల కొరత ఏర్పడిందని,… -
Uddhav Shiv sena: ముగింపుకు ఉద్ధవ్ సేన సంక్షోభం.. మీడియా ముందుకు తిరుగుబాటు ఎంపీలు..
Uddhav Shiv sena: మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ రోజు కీలకంగా మారబోతోంది. ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన(యూబీటీ) సంక్షోభం చివరకు చేరింది. ఉద్ధవ్ పార్టీపై తిరుగుబాటు చేసిన ఆరుగురు ఎంపీలు ఆదివారం మీడియా ముందు రాబోతున్నారు. తామెందుకు తిరుగుబాటు చేశామనే వివరాలను మీడియా ముందు వెళ్లడించనున్నారు. ఠాక్రేలు తమ సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రవర్తించడంతో తాము తమ దారి చూసుకోవాల్సి వచ్చిందని ఇప్పటికే ఎంపీలు చెబుతున్నారు. తిరుగుబాటు ఎంపీలు ఆదివారం సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించి, లోక్‌సభ స్పీకర్… -
Sanjay Raut: తప్పంతా సుప్రీంకోర్టుదే.. ఎంపీల తిరుగుబాటుపై సంజయ్ రౌత్..
Sanjay Raut: ఉద్ధవ్ ఠాక్రే శివసేన(యూబీటీ)లో మరోసారి తిరుగుబాటు చెలరేగింది. 9 మంది ఎంపీల్లో ఆరుగురు ఎంపీలు ఏక్నాథ్ షిండే శివసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిణామాలతో ఉద్ధవ్ సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా సమక్షంలోనే తిరుగుబాటు ఎంపీలపై బూతుల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా గురువారం కూడా సంజయ్ రౌత్ మరోసారి ఎంపీలపై దూషణలకు దిగారు. అంతటితో ఆగకుండా ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టుకు ముడిపెట్టారు. న్యూఢిల్లీలో మీడియాతో… -
Sanhay Raut: ఒక్కో ఎంపీని రూ. 50 కోట్లతో కొన్నారు.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు..
Sanhay Raut: ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన (యూబీటీ) మరోసారి చీలిక వర్గంగా మారింది. ఆ పార్టీకి 9 మంది ఎంపీలు ఉంటే ఆరుగురు ఎంపీలు తిరుగుబాటు చేయడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తిరుగుబాటు చేసిన ఎంపీలు ఢిల్లీకి వెళ్లారు. వీరంతా స్పీకర్‌ను తమది ప్రత్యేక వర్గంగా గుర్తించాలని కోరారు. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి ఎదురైన పరిస్థితులే, ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ఎదుర్కోంటోంది. ఈ తిరుగుబాటుపై ఉద్ధవ్ సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్…
తాజావార్తలు
-
India vs New Zealand: ఈడెన్ పార్క్‌లో టీమిండియా అజేయ రికార్డు.. 100% విజయాలతో భారత్ హవా!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
SIR New Schedule: తెలంగాణ, ఏపీ సహా 6 రాష్ట్రాల్లో SIR గడువు పొడిగింపు.. కొత్త షెడ్యూల్ ఇదే!
-
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని డబ్బు!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
ట్రెండింగ్
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!