మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితీశ్ రాణే శివసేన(యూబీటీ)సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే సంజయ్ రౌత్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నాడని వెల్లడించాడు. ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఢిల్లీలోని ఓ నాయకుడితో చర్చలు జరుపుతున్నారని నితీశ్ రాణే ఆరోపించారు. సంజయ్ రౌత్ రాజ్యసభ పదవి కాలం ముగిసే సమయం ఆసన్నమైంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని పార్టీకి ఆయనను మరో…