పత్రాచల్ ల్యాండ్ కేసుకు సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను ఆగస్టు 22 వరకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ముంబయిలోని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పత్రాచల్ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో అవకతవకల ఆరోపణలతో ఆగస్టు 1వ తేదీన సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది.