జూలై 13న అదృశ్యమైన పారిశుధ్య కార్మికుడి మృతదేహం కేరళ రాజధాని తిరువనంతపురంలోని కాలువలో సోమవారం ఉదయం లభ్యమైంది. శనివారం రోజున అమైజాంచన్ కాలువను శుభ్రం చేస్తుండగా పారిశుధ్య కార్మికుడు జాయ్ అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భారత నావికాదళం, స్థానిక పోలీసులు, అగ్నిమాపక దళం మరియు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) సోమవారం ఉదయం అతడి కోసం గాలింపు చర్యలు, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం 25 సర్కిల్ పరిధిలో ఎస్ఏఫ్ఏగా విధులు నిర్వహిస్తున్న కిషన్ అనే కామాంధుడు తన కింద పని చేసే ఓ కార్మికుకురాలిపై కన్నేసాడు. ఎలాగైనా ఆమెను శారీరకంగా అనుభవించాలని నిర్ణయించుకున్న అతను ఆమెపై అధికారి అనే అస్త్రాన్ని ఉపయోగించాడు.
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలను ఇవాళ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. టెట్ ఫలితాల్లో ఓ జీహెచ్‌ఎంసీ కార్మికుడు సత్తా చాటాడు.