సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు సోమవారం మరోసారి నోటీసులు ఇచ్చారు. నేడు ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు. పుష్ప -2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఇటీవల అరెస్టయిన అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. గత రెండు రోజులుగా వాదోప వాదనలతో ఈ కేసు వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయంశంగా మారింది.…
సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈ అంశం మీద సంచలన విషయాలు బయట పెట్టారు. ఓ సినీనటుడిని అరెస్ట్ చేస్తే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, ఈ ఘటనలో అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సంధ్య థియేటర్లోకి హీరో వచ్చేందుకు అనుమతి ఇవ్వలేదని ఒక్కటే దారి ఉంది కాబట్టి హీరో హీరోయిన్ రావద్దని చెప్పామని అన్నారు. హీరో కారులో వచ్చి…