శాండల్ వుడ్ కుంభకోణం గతేడాది సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. ఇద్దరు హీరోయిన్లు జైలుపాలయ్యారు. ప్రస్తుతం వారు బెయిల్ పై బయట ఉన్నప్పటికీ తాజాగా ఈ కేసు కీలక మలుపు తీసుకుంది. గతేడాది సెప్టెంబర్ లో వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ కేసులో కన్నడ హీరోయిన్లు సంజన గర్లని, రాగిణి ద్వివేది అరెస్టయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఇద్దరు జైలులో గడిపారు. గతేడాది డిసెంబర్లో సంజన…