శాండల్ వుడ్ కుంభకోణం గతేడాది సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. ఇద్దరు హీరోయిన్లు జైలుపాలయ్యారు. ప్రస్తుతం వారు బెయిల్ పై బయట ఉన్నప్పటికీ తాజాగా ఈ కేసు కీలక మలుపు తీసుకుంది.
గతేడాది సెప్టెంబర్ లో వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ కేసులో కన్నడ హీరోయిన్లు సంజన గర్లని, రాగిణి ద్వివేది అరెస్టయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఇద్దరు జైలులో గడిపారు. గతేడాది డిసెంబర్లో సంజన సుప్రీంకోర్టు కు వెళ్ళి మరీ బెయిల్ సంపాదించుకుంది. మరో హీరోయిన్ రాగిని ఈ ఏడాది జనవరిలో బెయిల్ పై బయటకు వచ్చింది. వారు జైలులో ఉన్నప్పుడే తీసుకున్నారా లేదా అని నిర్ధారణ పరీక్ష కోసం శాంపిల్స్ కలెక్ట్ చేసి హైదరాబాదులోని డ్రగ్స్ పరీక్ష నిర్ధారణ కేంద్రానికి తరలించారు. అందులో ఇద్దరు హీరోయిన్ల గోర్లు, హెయిర్ వంటి వాటిని శాంతి సేకరించారు. తాజాగా దానికి సంబంధించిన ఫలితాలు వచ్చాయి. ఫలితాలలో సంజన, రాగిణీ ఇద్దరు తీసుకున్నట్లుగా వెల్లడయింది. దీంతో డ్రగ్స్ విషయం మరోసారి శాండల్ వుడ్ లో కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న ఇద్దరు హీరోయిన్లను మళ్ళీ అరెస్ట్ చేస్తారా? వారి బెయిల్ రద్దు అవుతుందా అనే విషయం ఆసక్తికరంగా మారింది.
Read Also : అమితాబ్ కార్ సీజ్… కారణం సల్మాన్ ఖాన్ !!
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిటీ క్రైమ్ బ్రాంచ్ తర్వాత చర్యలు ఏమై ఉంటాయనే విషయం ఉత్కంఠను రేపుతోంది. ప్రస్తుతం రాగిని, సంజన డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపితమైంది. దీంతో వీరిద్దరికీ ఏడాది చొప్పున జైలు శిక్ష, రూ. 20,000 జరిమానా, లేదంటే రెండు కలిపి శిక్ష విధించవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల నెక్స్ట్ స్టెప్ ఏమై ఉంటుందో చూడాలి.