Pawan Kalyan: ఏపీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కీలక విషయాలను తాజాగా మాట్లాడారు. తిరుమల దేవస్థానం కేవలం యాత్ర స్థలం మాత్రమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణమని పేర్కొన్నారు. తిరుమల యాత్ర అనేది “భక్తి దైవానుగ్రహాన్ని కలుసుకునే స్థలం” అని పవన్ అన్నారు. అలాగే “తిరుమల లడ్డూ కేవలం స్వీట్ కాదు.. అది భక్తుల విశ్వాసానికి ప్రతీక” అని అన్నారు. భక్తులు ఈ ప్రసాదాన్ని కుటుంబ…