ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ మరో కొత్త గృహోపకరణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త బెస్పోక్ ఏఐ వాషింగ్ మెషీన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ యంత్రం 12 కిలోల వాష్, 7 కిలోల డ్రై కెపాసిటీతో వస్తుంది. ఈ ఉపకరణం నో-లోడ్ ట్రాన్స్‌ఫర్, ఆల్-వెదర్ డ్రైయింగ్, ఇంటెలిజెంట్ ఫాబ్రిక్ కేర్‌తో వస్తుంది. బెస్పోక్ AI వాషర్-డ్రైయర్ అద్భుతమైన పనితీరును అందిస్తుందని, విద్యుత్తును కూడా ఆదా చేస్తుందని, ఇది పట్టణ గృహాలకు మంచి ఎంపికగా మారుతుందని కంపెనీ…