ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో నిర్వహిస్తుంటారన్న విషయం తెలిసిందే. కానీ ఆ రాష్ట్రంలో దీనికి భిన్నంగా ఎయిర్ పోర్ట్ రన్ వే పై పరీక్ష నిర్వహించారు. రన్ వేను పరీక్షా కేంద్రంగా మార్చారు. ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. హోంగార్డ్ నియామక పరీక్ష రాయడానికి వచ్చిన ఎనిమిది వేల మంది అభ్యర్థులను ఎయిర్‌స్ట్రిప్‌పై కూర్చోబెట్టాల్సి వచ్చింది. 187 హోమ్ గార్డ్ పోస్టులకు కనీస అర్హత ఐదవ తరగతి ఉత్తీర్ణత.…