Samantha on IMDb 13th Spot: ఐఎండీబీ జాబితాలో 13వ స్థానాన్ని సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, తన కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది అని స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు తెలిపారు. కెరీర్‌ను ఇప్పుడే మొదలుపెట్టినట్లు అనిపిస్తుందని, అప్పుడే ఇన్నేళ్లు ఎలా గడిచాయో తనకు అర్థం కావట్లేదన్నారు. తనకు గొప్ప సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని, ఇకపై మరింత ఎక్కువ కష్టపడి పనిచేస్తానని సామ్ చెప్పారు. ఇటీవల ఐఎండీబీ విడుదల చేసిన ‘టాప్ 100…