బాలీవుడ్ లో ప్రస్తుతం అందరూ తెగ మాట్లాడుకుంటోన్న మల్టీ స్టారర్ ‘పఠాన్’. అదేంటి ఆ సినిమా ఓన్లీ షారుఖ్ ఖాన్ మూవీనే కదా అంటారా? నిజమే ‘పఠాన్’లో ఎస్ఆర్కేనే హీరో. కానీ, దాదాపు 20 నిమిషాల సేపూ తెరపై సల్మాన్ కనిపిస్తాడట. అదీ దుమ్మురేపే యాక్షన్ సీన్స్ లో! ఇందుకోసం నిర్మాత ఆదిత్య చోప్రా, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ భారీగా బిల్డప్ షాట్స్ ప్లాన్ చేశారట. రష్యన్ మాఫియాని ఎదుర్కొంటోన్న షారుఖ్ అనుకోకుండా ఇబ్బందుల్లో పడగా ‘టైగర్’…