సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో అమ్మే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ను నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ, కార్పొరేషన్ ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్ కోసం సర్వీస్ ప్రొవైడర్‌ను నిర్వహించనుంది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లు ఎ.పి.ఎఫ్‌డిసితో ఒప్పందం చేసుకోవాలని, ప్రొవైడర్ గేట్‌వే ద్వారా మాత్రమే సినిమా టిక్కెట్లను విక్రయించాలని ప్రభుత్వం చెబుతోంది. ఈ పోర్టల్ సినిమా విడుదలకు ముందే బుకింగ్ స్లాట్‌లను నిర్వహించనుంది. రిలీజ్ కి ఒక వారం ముందు థియేటర్లు…