Budget 2023: గత రెండేళ్లుగా బడ్జెట్‌లో వేతన జీవులకు నిరాశే మిగులుతోంది. కోవిడ్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వేతన జీవులకు ట్యాక్స్ మినహాయింపులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. అయితే వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరట లభిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈసారి ఆదాయ పన్ను శ్లాబుల్లో మార్పులు ఉంటాయని ఆర్ధిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 4 శ్లాబుల ద్వారా ఆదాయపు పన్ను మినహాయింపులు లభిస్తున్నాయి. రూ.2.5 లక్షల ఆదాయం వరకు…