రెండేళ్ల పాటు కరోనా కారణంగా కుదేలైన సినిమా రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయితే ఇంతలోనే కొత్త సమస్యలు కొన్ని చిత్రసీమను ఉక్కిరి బిక్కిరి చేయబోతున్నాయన్నది ఫిల్మ్ నగర్ టాక్. ఫిల్మ్ ఫెడరేషన్‌లోని 24 క్రాఫ్టులకు సంబంధించిన వేతనాలను సవరించాల్సి ఉండటంతో వారు నిర్మాతలపై ఒత్తిడి చేస్తున్నారు. వెంటనే వేతనాలను పెంచకపోతే, జూలై 1వ తేదీ నుంచి యూనియన్లు సమ్మె బాట పట్టినా ఆశ్చర్యం లేదని ఫెడరేషన్ పెద్దలు కొందరు చెబుతున్నారు. సమ్మె నోటీస్‌ను ఫెడరేషన్ ఇటు ఫిల్మ్…
కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్(APREI) సొసైటీ రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీరికి రివైజ్డ్ పేస్కేల్ ప్రకారం మినిమం టైమ్‌స్కేల్‌ను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీవో నెం.40 వర్తింపజేస్తూ సొసైటీ కార్యదర్శి ఆర్ నరసింహరావు మెమో జారీ చేశారు. ఈ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు…
పీఆర్సీ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుని తీవ్రంగా విమర్శించారు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ. ‘పెళ్లయిన ఆరు నెలలకు శుభలేఖ ప్రచురించినట్లుగా’ అశుతోష్ మిశ్రా నివేదికను ఇప్పుడెందుకు బయట పెట్టారు?చర్చలకు ముందే పీఆర్సీ నివేదిక ఉద్యోగులకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కుంటి సాకులు చెప్పింది. పీఆర్సీఫై ఉద్యోగ సంఘాల నేతలను సైతం అప్రతిష్టపాలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసిందన్నారు రామకృష్ణ. పీఆర్సీ ఒప్పందంపై ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.…
తమ డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లతో ప్రభుత్వం సంప్రదింపులకు దిగింది. వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఆ శాఖ కమిషనర్ కె.భాస్కర్, ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర లతో భేటీ అయ్యారు ఆశా వర్కర్ల సంఘం ప్రతినిధులు. ఎన్ సిడిసి సర్వేను ఆశా వర్కర్లతో చేయించడం వల్ల పని భారం పెరిగిందని తక్షణమే నిలిపివేయాలని కోరారు ఆశా వర్కర్ల సంఘం. గౌరవ వేతనం రూ. 10 వేల నుంచి రూ. 15…
కరోనా కారణంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో వర్క్ కల్చర్ పూర్తిగా మారిపోయింది. ఆఫీస్‌కు వచ్చి పనిచేసేవారు చేస్తున్నారు. ఇంటినుంచి పనిచేసే వారు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. ఇక జీతాల విషయాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. గతంలో నెలకు ఒకమారు జీతాలు ఇచ్చేవారు. అయితే, ఇప్పుడు నెలవారీ జీతాల విధానాలకు స్వస్తి పలికి వారం వారం జీతాలు ఇచ్చే కల్చర్‌కు తెరతీశారు. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, హాంకాంగ్ వంటి దేశాల్లో వివిధ సంస్థలు ఉద్యోగులకు వారం వారం…
ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ ప్రభుత్వం మీది. మీ సహకారంతో మంచి చేయగలుగుతున్నాను. ఆర్థిక పరిస్థితుల వల్ల, కరోనా ప్రభావం వల్ల మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చు. కానీ ఎంతమేర మేలు చేయగలుగుతామో అన్ని రకాలుగా చేశాం అన్నారు జగన్. రాజకీయాలు ఇందులోకి వస్తే.. వాతావరణం దెబ్బతింటుంది. రాజకీయాలకు తావు ఉండకూడదు. ఏదైనా సమస్య ఉంటే.. అనామలీస్ కమిటీ కూడా ఉంది. ఎప్పుడైనా మీరు మీ సమస్యలను చెప్పుకోవచ్చు. ఉద్యోగ సమస్యలపై మంత్రుల…
ఏపీలో ఓ వైపు పీఆర్సీ రగడ నడుస్తుండగానే ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది. దీనిపై ఉద్యోగ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల చెల్లింపుల పై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. జీతాల చెల్లింపు ప్రాసెసింగ్‌కు కూడా ఇవాళే డెడ్ లైన్ ఉంది. దీంతో ఆర్థిక శాఖ శర వేగంగా పీఆర్సీ బిల్లులను సిద్ధం చేస్తోంది. నిన్న, మొన్న ఉద్యోగుల జీతాల బిల్లులు అప్లోడ్ చేసిన ట్రెజరీ శాఖ ఉద్యోగులు. Read Also:…
ఏపీలో ఉద్యోగులు తమ డిమాండ్లు నెరవేరేవరకూ పోరాటం ఆపేది లేదంటున్నారు. మరోవైపు ప్రభుత్వం కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తోంది. సమ్మెకు సిద్ధమవుతున్న ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్రంగా స్పందించారు. ఎస్మా చట్టం ప్రయోగించినా భయపడేది లేదన్నారు. శ్రీకాకుళం ఎన్జీవో హోమ్ వద్ద రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన ఆయన మీడియాతో మాట్లాడారు.…
ఏపీలో పీఆర్సీ వ్యవహారంలో చిక్కుముడులు వీడకపోవడంతో జనవరి నెల జీతాల పరిస్థితిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికీ ప్రాసెస్ కాని జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేసే బాధ్యతను డీడీఓలకంటే పైస్థాయి అధికారులకు అప్పగించారు. ఎలాగైనా జీతాల ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశాలు రావడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు వివిధ జిల్లాల కలెక్టర్లు. జీతాల బిల్లులు ప్రాసెస్ కాకుంటే ప్రత్యామ్నాయాలు చూడాలన్న ప్రభుత్వం ఆదేశాల మేరకు డీడీఓలకంటే పై స్థాయి అధికారులకు బాధ్యతల…
ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న పీఆర్సీపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగులు ఆందోళన బాట పట్టడంతో ఎస్మా ప్రయోగించే అంశంపై ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. కీలక శాఖలు కూడా ఉద్యమంలోకి వెళ్తామంటూ స్పష్టం చేయడంతో అలెర్టయింది ప్రభుత్వం. సమ్మె దిశగా అడుగులేస్తోన్న ఆర్టీసీ, విద్యుత్, వైద్యారోగ్య శాఖ ఉద్యోగులను ఎలాగైనా దారికి తీసుకురావాలని భావిస్తోంది. ఎస్మా ప్రయోగించే అంశంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. ఏయే శాఖల్లోని ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించవచ్చనే అంశంపై శాఖల వారీగా జాబితాను సిద్దం చేస్తోన్న…