ఓ నాటి అందాలతార, హిందీ సినిమా ఫస్ట్ సూపర్ స్టార్ ముద్దుల కూతురు, ఈ నాటి సూపర్ స్టార్ ప్రియమైన భార్య- ఇన్ని ఉపమానాలు విన్న తరువాత ఆమె ట్వింకిల్ ఖన్నా అని సినీఫ్యాన్స్ ఇట్టే పసికట్టేస్తారు. బాలీవుడ్ ఫస్ట్ సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నా, అప్పటి అందాలభామ డింపుల్ కపాడియా దంపతుల పెద్ద కూతురు ట్వింకిల్ ఖన్నా. తల్లిదండ్రుల బాటలోనే పయనిస్తూ ట్వింకిల్ ఖన్నా సైతం కొన్ని చిత్రాలలో నాయికగా నటించారు. తెలుగు సినిమా ‘శీను’లో…