సినీ నటి, బీజేపి నేత ఖుష్బూపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత సాదిక్‌పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. వారం క్రితం సీని నటి ఖుష్బూపై ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు బీజేపీలోని ఖుష్బూ, నమిత, గౌతమి, గాయత్రీ రఘురామన్‌లు ఐటమ్స్ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
డీఎంకే నేత సైదాయ్ సాదిక్ రాజకీయ నేతలుగా మారిన నటీమణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మహిళలను కించపరుస్తూ సాదిక్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించాలని సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూ డిమాండ్ చేశారు.