చిన్నారి చైత్రకు ప్రభుత్వం, పోలీసులు చెయ్యలేని న్యాయం దేవుడు చేశాడని వైఎస్ఆర్.టి.పి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ అన్నారు. 6 ఏళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసి హత్యచేశాడు. కనీసం 7 రోజులు గడిచినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి కారణం ఆ కుటుంబ పేదరికమేనని షర్మిల పేర్కొన్నారు. వైఎస్ షర్మిళ మాట్లాడుతూ.. ‘మేము దీక్ష చేసిన తరువాతే ప్రభుత్వంలో చలనం వచ్చింది. శాంతియుతంగా మేము దీక్ష చేస్తుంటే రాత్రి 2 గంటలకు 200 మంది పోలీసులు మాపై దాడిచేశారు.…
నేచురల్ స్టార్ నాని “బయటెక్కడో ఉన్నాడు… ఉండకూడదు” అంటూ ట్వీట్ చేశారు. అయితే ఇది సినిమాల గురించి కాదు. ఆరేళ్ళ చిన్నారిపై జరిగిన హత్యాచార ఘటనపై నాని స్పందన. సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో ఓ ఆరేళ్ళ చిన్నారిని క్రూరంగా హత్యాచారం చేసిన నిందితుడిపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రజలతో పాటు సెలెబ్రిటీలు సైతం ఈ అమానవీయ ఘటనపై మండిపడుతున్నారు. పోలీసులు త్వరగా నిందితుడిని పట్టుకోవాలని, వాడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో నిందితుడు…
హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన చిన్నారి ఘటనపై నటుడు మహేష్ బాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు చేపట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయాలనీ అధికారులను మహేష్ కోరారు. సమాజం ఎంతగా పడిపోయిందో ఈ ఘటన గుర్తుచేస్తుందన్నారు. ఆడపిల్లలు ఎప్పుడు సురక్షితంగా ఉంటారా? అనేది ఎల్లప్పుడూ ఒక ప్రశ్నగానే మిగిలిపోతుందని మహేష్ బాబు ఆవేదనగా ట్వీట్స్ చేశారు. నటుడు మంచు మనోజ్ కూడా ఈరోజు చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ…