తాడేపల్లి అరాచకాలు తాలిబాన్లను మించిపోతున్నాయని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.. వైసీపీకీ రోజులు దగ్గర పడ్డాయని, రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్త సైదాపై వారి కార్యకర్తల దాడి హేయమైన చర్యగా అభివర్ణించారు. టీడీపీ కార్యకర్త సైదాపై నాలుగు రోజుల క్రితమే దాడి జరిగినా కేసు పెట్టరా.? అంటూ పోలీసులపై విమర్శనాస్త్రాలను సంధించారు. పోలీసులు ఉన్నది కాపాడడానికా..? రెడ్ కార్పెట్ వేసి దాడులు చేయించడానికా అంటూ పోలీసులపై అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు.…
గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం తుమ్మలచెరువులో దారుణం జరిగింది. సైదా అనే టీడీపీ కార్యకర్తపై ప్రత్యర్ధులు దాడికి పాల్పడ్డారు. బైక్ పై వెళ్లి వస్తుండగా అడ్డగించి రాళ్ళతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ సైదాని ఆస్పత్రికి తరలించారు.